క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు పలువురు క్రికెటర్లు హాజరు అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ హర్షిత్ రాణా తదితరులు సర్ఫరాజ్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Indian Railways: రైల్వే బోగీకి, కోచ్‌కి మధ్య తేడా ఉంది.. తెలియకపోతే తెలుసుకోండి?
అయితే, పెళ్లి తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ను టీమిండియాలోకి మీ ఎంట్రీ ఎప్పుడు అని విలేకర్లు ప్రశ్నించారు. ఆ దేవుడి దయ ఉంటే.. ఏదో రోజు ఖచ్చితంగ ఇండియా తరుపున ఆడుతానని అతడు చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్, 39 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 79.65 సగటుతో 3559 రన్స్ చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో సగటు విషయంలో ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మెన్ తర్వాతి స్థానంలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ని టీమిండియా సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.
Read Also: CM Jagan: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం
ఇక, వచ్చే డిసెంబర్ వరకూ టీమిండియా, టెస్టు ఫార్మాట్ ఆడడం లేదు. డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌కి కూడా సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కడం అనుమానంగా ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్స్‌కి ఆడిన సర్ఫరాజ్ ఖాన్ కు ఇప్పటి వరకు సరైన అవకాశాలు రాలేదు.. వచ్చిన ఒకటి రెండు అవకాశాలను సర్ఫరాజ్ ఖాన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు.
