Site icon NTV Telugu

Rinku Singh Engagement: ఘనంగా రింకూ – ప్రియా సరోజ ఎంగేజ్మెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ..!

Rinku Singh Engagement

Rinku Singh Engagement

Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్, యువ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ ఎంగేజ్మెంట్ వేడుక ఆదివారం లక్నోలోని ది సెంట్రమ్ లగ్జరీ హోటల్‌లో ఘనంగా జరిగింది. క్రికెట్, రాజకీయ రంగాల మిళితంతో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ వేడుక జరుగుతున్న సమయంలో రింకూ సింగ్ తన కాబోయే భార్య ప్రియా సరోజకి ఉంగరం తొడిగే సమయంలో ఆమె కన్నీళ్లను ఆపలేకపోయింది. భావోద్వేగానికి గురైన ప్రియా కొంతసేపు ఎమోషనల్ అవుతూ, తర్వాత ఆనందంతో కెమెరాల ఎదుట నిలిచింది. ఈ కన్నీటి క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Read Also: Robberies in Temples: గుడిలో జడ్జి మంగళసూత్రం దొంగతనం.. 10 మంది మహిళా దొంగల అరెస్టు..!

ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు 300 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ కెప్టెన్ ఆర్యన్ జుయాల్‌తో పాటు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్, డింపుల్ యాదవ్, ఇక్రా హసన్ వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా, ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక కోసం ముందస్తుగా రింకూ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బులంద్‌ షహర్‌ లోని చౌధేరా వాలీ విచిత్రా దేవీ ఆలయానికి వెళ్లి అక్కడ ఆశీస్సులు తీసుకున్నారు.

Read Also: Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!

ఓ హోటల్‌లో భారీ ఏర్పాట్ల మధ్య వేదికపై రింగ్ సెరమనీ జరిగింది. భద్రత కోసం బార్కోడ్ ఎంట్రీ పాస్‌లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆనందాన్ని పెంచే వేడుకలో ఎంపీ ప్రియా సరోజ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు అందరిని ఆశర్యపరుస్తుంది. ఈ సందర్బంగా రింకూ – ప్రియా జంటకు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version