Funny : భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు క్రికెట్ ప్రేమికుల సంఖ్య భారీగా ఉంటుంది. క్రికెట్ పోటీలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఏదో ఒక ఫన్ జరుగుతూనే ఉంటుంది. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటిదే, సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. ఈ వీడియోలో ఒక ఫీల్డర్ బంతిని మూడుసార్లు ఆపడానికి ప్రయత్నించాడు. అది బౌండరీ లైన్‌కు చేరుకున్నప్పుడు చివరకు కిందపడిపోతాడు. కానీ బంతిని ఆపడంలో విఫలమయ్యాడు. అతను బంతిని బౌండరీ దాటించేస్తాడు.
ఈ వీడియోను అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో బౌలర్ విసిరిన బంతిని రివర్స్ స్వీప్ షాట్‌తో కొట్టేందుకు బ్యాట్స్‌మెన్ ప్రయత్నించడం కనిపించింది. కానీ బంతి అతని బ్యాట్‌కు సరిగ్గా తగలదు. ఈ బంతి ఫీల్డర్‌ను తాకుతూ బయటకు వెళ్తుంది. అతను బంతితో కింద పడిపోయాడు. ఫీల్డర్ బంతిని అక్కడ ఆపడానికి ప్రయత్నించాడు. మళ్లీ ప్రయత్నించినా ఆగలేదు. ఆఖరి ఓవర్‌లో అతను పడిపోయి.. మూడోసారి బంతిని క్యాచ్ పట్టాడు. బంతిని విసిరేందుకు ప్రయత్నించగా, బంతి కాలికి తగిలి బౌండరీ దాటింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— That’s So Village (@ThatsSoVillage) March 12, 2023