NTV Telugu Site icon

AUS vs PAK: క్యాప్‌తో బంతిని ఆపినా.. 5 పరుగుల పెనాల్టీ ఇవ్వని క్రికెట్ ఆస్ట్రేలియా! కారణం ఏంటంటే

5 Run Penalty

5 Run Penalty

పాకిస్తాన్‌ యువ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి ఇప్పటికే నెట్టింట హాట్‌టాపిక్‌ అయిన ఆయుబ్‌.. ఈసారి క్యాప్‌తో బంతిని ఆపి మరోసారి వార్తలో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్టులో ఆయుబ్‌ బంతిని ఆపే క్రమంలో జారిపడి.. క్యాప్‌తో బంతిని ఆపాడు. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 5 పరుగుల పెనాల్టీ ఆసీస్ జట్టుకు ఇవ్వలేదు. ఇందుకు కారణంను సీఏ సోషల్ మీడియాలో వెల్లడించింది.

మూడో రోజు ఆటలో భాగంగా స్టీవ్‌ స్మిత్‌ బాదిన బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో సయీమ్‌ ఆయుబ్‌ జారిపడ్డాడు. ఆయుబ్‌ కిందపడిన సమయంలో క్యాప్‌ మైదానంలో పడగా.. బాల్‌ అందులోకి వెళ్ళింది. దాంతో బంతి బౌండరీ వెళ్లలేదు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా 5 పెనాల్టీ పరుగులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో 5 పరుగులు రావాల్సిందని చాలా మంది సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పందించింది.

Also Read: T20 World Cup 2024: భారత అభిమానులకు గుడ్‌న్యూస్.. రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ!

‘పెనాల్టీ పరుగుల గురించి అడిగిన వారి కోసం ఈ సమాధానం. క్యాప్‌ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయింది. ఇది ప్రమాదవశాత్తు (యాక్సిడెంటల్‌గా) జరిగిన పరిణామం. అంతేకాని ఫీల్డర్‌ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. హెల్మెట్‌ల మాదిరి క్యాప్‌ను ఉద్దేశపూర్వకంగా మైదానంలో వదిలిపెట్టలేదు. అందుకే బ్యాటింగ్‌ జట్టుకు పెనాల్డీ పరుగులు ఇవ్వలేదు’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సీఏతో ఏకీభవించాడు.