NTV Telugu Site icon

Sunita Williams:సునీతా రాకకు కౌంట్‌డౌన్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ-10 మిషన్‌..

Sunitha

Sunitha

ప్రపంచ మంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడమే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. సునీతా రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి ప్రయోగించిన క్రూ డ్రాగన్ (స్పేస్‌క్రాఫ్ట్) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించింది. డాకింగ్ ప్రక్రియ కూడా ఈరోజు (మార్చి 16) పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే ఇద్దరూ మార్చి 19న భూమికి తిరిగి చేరుకుంటారని సమాచారం. సమాచారం ప్రకారం.. అంతరిక్ష నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు.

Also Read:KTR: విద్యార్థులపై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ప్రభుత్వంపై ఫైర్

స్పేస్‌ఎక్స్ నాసా సహకారంతో క్రూ-10 మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రూ డ్రాగాన్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. డ్రాగన్ అంతరిక్ష నౌక నలుగురు కొత్త వ్యోమగాములను తీసుకుని అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది. వీరిలో నాసా కమాండర్ అన్నే మెక్‌క్లెయిన్, పైలట్ అయర్స్, జపాన్ అంతరిక్ష సంస్థ JAXA టకుయా ఒనిషి, రష్యన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. గత ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారు వారం తర్వాత భూమికి తిరిగి చేరుకోవాలి. కానీ బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్య కారణంగా, వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. 9 నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండిపోయారు.