ఈ మధ్య డెబిట్ కార్డులతో పాటుగా క్రెడిట్ కార్డులను కూడా ఎక్కువగా వాడుతుంటారు… నెలకు ఒక్కసారి బిల్ కట్టుకోవడంతో చాలా మంది వాడుతున్నారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ప్రకటిస్తూ కార్డులను తీసుకొనేలా చేస్తారు.. అయితే లావాదేవిలకు చార్జీలను వసూల్ చేస్తారు.. మరికొన్ని వాటికి కొంత డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది.. అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉండడంతో క్రెడిట్ కార్డు యూజర్స్ కూడా పెరిగిపోయారు. రిచ్, పూర్ అనే తారతమ్యం లేకుండా క్రెడిట్ కార్డులను తీసుకుని వాడేస్తున్నారు. బ్యాంకులు కూడా శాలరీతో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి.
అయితే క్రెడిట్ కార్డులు వాడే వారికి బిగ్ షాక్ ఇచ్చింది ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ. పలు రకాల క్రెడిట్ కార్డులపై ఛార్జీలు, ఇతర ఫీజుల్లో భారీ మార్పులు చేసింది.. ఎంత చార్జీలను పెంచారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. ప్లాటినమ్, కోరల్, రుబిక్స్, సఫ్పిరో వంటి క్రెడిట్ కార్డులపై ఛార్జీలు, ఇతర ఫీజుల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. కొత్త చార్జీలను ఈ నెల నుంచే అమల్లోకి వస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది..
ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు.. ఈ కార్డును పొందాలంటే మొదట రూ.12,499 చెల్లించాలి. ఫస్ట్ ఇయర్ యాన్యువల్ ఫీ ఏమీ వసూలు చేయరు. సెకండ్ ఇయర్ నుంచి రూ.12,499గా చెల్లించాల్సి ఉంటుంది… తిరిగి మొత్తం రిఫండ్ పొందాలంటే బాగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది.
సఫ్పిరో క్రెడిట్ కార్డు.. ఈ క్రెడిట్ కార్డుపై ప్రవేశ రుసుము రూ.6,500 కొత్త ఛార్జీని ప్రకటించింది. మొదటి ఏడాది యాన్యువల్ ఫీ ఉండదు.. ఆ తర్వాత ఇయర్ నుంచి రూ.3500 చెల్లించాలి. ఈ ఫీజు రిఫండ్ పొందాలంటే రూ.6 లక్షలు ఖర్చు చేయాలి.
అలాగే..కోరల్ క్రెడిట్ కార్డు..ఈ క్రెడిట్ కార్డుపై జాయినింగ్ ఫీ రూ.300 ఉంది. రెండో ఏడాది నుంచి వార్షిక రుసుములు రూ.500 కట్టాలి. రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీ రిఫండ్ అవుతుంది. మిగిలిన కార్డుల పై కూడా చార్జీలను పెంచినట్లు తెలుస్తుంది..