Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపు

Cm Chandrababu

Cm Chandrababu

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘అమరావతి లో ఉన్న గ్రామ కంఠాల అభివృద్ధి కి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. 904 కోట్లు 29 గ్రామాలకు కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.. నీటి సరఫరా…కు 64 కోట్లు…సీవరేజ్ కోసం 110 కోట్లు..రోడ్లు..కోసం..300 కోట్లు..కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ లో అనుమతి తర్వాత.. రాబోయే 10 రోజుల్లో టెండర్లు పిలుస్తాం.. మంగళగిరి లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది..

Also Read:Vizianagaram :విజయనగరం చెల్లూరు వద్ద బస్సు బోల్తా.

జేమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ తీసుకుని సీఆర్డీఏ ముందుకు వెళుతుంది.. ల్యాండ్ పూలింగ్ లో అస్సయిన్ అని రాస్తే ల్యాండ్ వేల్యూ తక్కువగా ఉందని రైతులు చెప్పారు.. అస్సయిన్ అనే పదాన్ని తీసేయ్యాలి అని సీఎం చెప్పారు.. అమరావతి నిర్మాణం లో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కోసం సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.. అమరావతి లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది..

Also Read:సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం

ఎస్సార్ఎం విట్ కు 2014 లో కమిట్ మెంట్స్ ప్రకారం చెరో 100 ఎకరాలు కేటాయిస్తున్నాం.. అమరావతి రాజధాని పై ఎవరెన్ని విమర్శలు చేసిన వచ్చే మార్చ్ లో అధికారులకు ఇళ్లు కేటాయిస్తూన్నాం.. ఏదేమైనా 3 ఏళ్లలో రోడ్లు ఐకానిక్ బిల్డింగ్స్ పూర్తి అవుతాయి.. ఇవన్నీ వైసీపీకి తెలుసు… కావాలంటే అమరావతికి వచ్చి చూసుకోవచ్చు.. వర్షాల వల్ల ప్రస్తుతం పనులకు కొంత ఇబ్బంది ఉంది.. ఐకానిక్ టవర్ చుట్టూ పెద్ద గుంట తవ్వారు.. నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి అని’ వెల్లడించారు.

Exit mobile version