ఏపీ రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో, రోడ్ల వెంట చెట్లు, చెత్తను తొలగించే పనులు మొదలయ్యాయి. ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం అమరావతి ప్రాంతంలో పనులను పరిశీలించారు. జేసీబీ యంత్రాలతో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ మొదలయ్యాయి. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.