Site icon NTV Telugu

Budget Problems : భారీ బడ్జెట్ సమస్యతో ఆగిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్

Krish 4

Krish 4

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ‘క్రిష్ 4’ ఒకటి. ఈ సినిమాతో హృతిక్ రోషన్ దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘హోల్డ్’లో పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హృతిక్ రోషన్ మరియు నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య తలెత్తిన బడ్జెట్ విభేదాలే అని బాలీవుడ్ వర్గాల సమాచారం.

Also Read : Bhooth Bangla : అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ రిలీజ్ డేట్ చేంజ్

నివేదికల ప్రకారం, హృతిక్ రోషన్ ఈ సూపర్ హీరో ఎపిక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాలని భావిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయాలని హృతిక్ పట్టుబడుతున్నారు. అయితే, నిర్మాత ఆదిత్య చోప్రా మాత్రం సినిమా ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలంటే బడ్జెట్‌ను రూ. 350 కోట్ల వద్దే నియంత్రించాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు సమాచారం. బడ్జెట్ విషయంలో ఆదిత్య చోప్రా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను హృతిక్ సానుకూలంగానే తీసుకున్నారని, ప్రస్తుతం స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. బడ్జెట్‌ను అదుపులో ఉంచుతూనే తన విజన్‌ను ఎలా చూపించాలనే దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో, ఈ సినిమా కోసం ఇతర నిర్మాణ సంస్థలతో చర్చలు జరపడం లేదా ‘క్రిష్ 4’ మొదలుపెట్టే లోపు మరో సినిమాను పూర్తి చేయాలని హృతిక్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version