Site icon NTV Telugu

Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా..

Trending Viral Video

Trending Viral Video

ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఈ అప్గ్రేడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక మరోవైపు ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరించడం పరిపాటీ. కాకపోతే ప్రస్తుతం సమాజం మారుతున్న కొద్దీ ప్రజలు వింత కోరికలు కోరుకుంటూ అందుకు తగ్గ దుస్తులను ఫ్యాషన్ పేరుతో వేసుకుంటూ చర్చనీయాంశంగా మారుతున్నారు.

Also read: SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ఈ కోవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రముఖ బ్రాండెడ్ సంస్థ డిజైన్ చేసిన దుస్తులు బాగా వైరల్ గా మారాయి. వైరల్ గా మరీనా వీడియోలో చూస్తే.. ఒక చొక్కా, మరొక చిన్న నిక్కర్ లాంటివి వారి షోరూమ్ లో అమ్మకానికి ఉంచారు. ఈ ప్రత్యేకమైన డిజైన్ దుస్తులు చూస్తే మాత్రం అసలు ఇవి కొత్త బట్టల లేక ఎక్కడైనా చినిగిపోయిన దుస్తులను ఉతికి అక్కడ షోరూమ్ లో ఉంచారన్న అనుమానం కచ్చితంగా వస్తుంది.

Also read: Worldcup jersey: ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..

చొక్కా విషయానికి వస్తే.. ముందు, వెనుక భాగంలో ఏమి ఉండదు. కేవలం రెండు చేతులు మధ్యలో ఒక టై లాగా ఉంటె ఒక గుడ్డ పీలికను తగియించారు. ఇక మరో నిక్కర్ విషయానికి వస్తే.. కేవలం నడుముకి బిగించుకునేందుకు వీలుగా ఒక చిన్నపాటి పిలకకు ఒక బటన్ ఉంచి కింది భాగం పూర్తిగా తొలగించబడింది. కాస్త స్టైలిష్ గా ఉండేందుకు వెనుక భాగంలో రెండు జోబులను మాత్రం అలాగే ఉంచారు. ఈ వైరల్ గా మారిన వీడియోను చూసిన నెటిజన్స్.. సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి దుస్తులను ఎవరైనా ధరిస్తారా..? ఎందుకు ఇలాంటి పనికిరాని ట్రెండ్ ను మొదలు పెడతారు అంటూ అంటుండగా.. మరికొందరేమో ఈ దుస్తులను ఏ ఫంక్షన్ లో వేసుకోవడానికి వీలుగా ఉంటుందో చెప్పాలంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version