Site icon NTV Telugu

Samsung Galaxy S24 Ultra 5G: డీల్ అదిరింది.. 200MP కెమెరాలు ఉన్న సామ్ సంగ్ ఫోన్‌ పై రూ. 50 వేల డిస్కౌంట్..

Samsung Galaxy S24 Ultra

Samsung Galaxy S24 Ultra

ఫోన్ కొనేముందు మెయిన్ ఫీచర్స్ అయిన ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ర్యామ్ బెటర్ గా ఉండేలా చూస్తుంటారు. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ, ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అయితే మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సామ్ సంగ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఏకంగా 200MP కెమెరా ఫోన్ పై క్రేజీ డీల్ ప్రకటించింది. ఈ ఫోన్ పై ఏకంగా రూ.50 వేలకు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు 200MP కెమెరా ఉన్న సామ్ సంగ్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Also Read:Donald Trump: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై అమెరికా నిఘా నివేదికను తప్పుబట్టిన ట్రంప్..

Samsung Galaxy S24 Ultra ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.134,999. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 86,823కి లిస్ట్ చేశారు. ఈ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం అందుబాటులో ఉంది. వివిధ కలర్ వేరియంట్‌ల ధర భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు టైటానియం గ్రే రంగులో ఉన్న Samsung Galaxy S24 Ultra 5Gని రూ.86,823కి పొందవచ్చు. టైటానియం బ్లాక్ వేరియంట్ ధర దాదాపు రూ.1,000 ఎక్కువ. అదనంగా, మీరు బ్యాంక్ ఆఫర్‌తో రూ.4,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు Flipkart SBI క్రెడిట్ కార్డులు మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 4,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు, దీని వలన ఫోన్ ధర రూ.82,823కి తగ్గుతుంది. 

Also Read: Off The Record: బండి సంజయ్ మాటలకు కౌంటర్‎గానే ఈటల ఆలా అన్నారా ?

ఈ ధరకు, మీరు 200MP + 50MP + 12MP + 10MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 12MP ఫ్రంట్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. Samsung Galaxy S24 Ultra 5G 6.8-అంగుళాల Quad HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్టైలస్‌తో కూడా వస్తుంది. మీకు శక్తివంతమైన ప్రాసెసర్, AI అసిస్టెంట్, గొప్ప కెమెరా ఉన్న ఫోన్ కావాలంటే, ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. ఈ స్మార్ట్‌ఫోన్ 2031 వరకు సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ ను అందుకుంటుంది.

Exit mobile version