Site icon NTV Telugu

CPL 2025: 46 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే.. టీ20ల్లో 5/21 గణాంకాలు!

Imran Tahir Cpl 2025

Imran Tahir Cpl 2025

Imran Tahir Takes 5 wickets in CPL 2025: ఓ ప్లేయర్ 46 ఏళ్ల వయసులో క్రికెట్‌లో కొనసాగడమే చాలా కష్టం. అందులోనూ తీవ్ర పోటీ, ఒత్తిడి ఉండే టీ20ల్లో బరిలోకి దిగడం అంటే మాములు విషయం కాదు. ఈ వయసులో టీ20ల్లో ఆడటమే అరుదు అయితే.. కుర్రాళ్లను మైమరపిస్తూ ఐదు వికెట్స్ పడగొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇదంతా చేసి చుపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో సంచలన ప్రదర్శన (5/21) చేశాడు. ఈ ప్రదర్శనతో ఇప్పటికీ తాను టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని తాహిర్‌ మరోసారి నిరూపించుకున్నాడు.

కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో గయానా అమేజాన్‌ వారియర్స్‌ జట్టుకు లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ సారథ్యం వహిస్తున్నాడు. శనివారం అంటిగ్వా అండ్‌ బర్బుడా ఫాల్కన్స్‌తో గయానా టీమ్ తలపడింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. షాయ్ హోప్ (82), షిమ్రాన్ హెట్మైర్ (65) హాఫ్ సెంచరీలు బాదారు. లక్ష ఛేదనలో అంటిగ్వా టీమ్ ఇమ్రాన్‌ తాహిర్‌ స్పిన్ దెబ్బకు కుదేలైంది. అంటిగ్వా 128 పరుగులకే ఆలౌట్ అయి.. 83 పరుగుల తేడాతో ఓడింది. తాహిర్‌ తన నాలుగు ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి ఐదు వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Crime News: మేడిపల్లిలో దారుణం.. గర్భవతైన భార్యను రంపంతో ముక్కలుగా కోసి హత్య చేసిన భర్త!

టీ20ల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ఇమ్రాన్‌ తాహిర్‌ రికార్డు నెలకొల్పాడు. 2014లో అరంగేట్రం చేసిన తాహిర్ 59 మ్యాచ్‌లు ఆడి 20.77 సగటుతో 82 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 7.76గా ఉంది. గతంలో తాహిర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలు 4/12 (ఐపీఎల్). ఐపీఎల్ 2019లో ఈ అత్యున్నత ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లలో 16.57 సగటుతో 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఇటీవలి సీపీఎల్ సీజన్లలో మంచి ప్రదర్శనలలో ఆకట్టుకున్నాడు.

Exit mobile version