Site icon NTV Telugu

CPI Ramakrishna: ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..!

Cpi Ramakrishna

Cpi Ramakrishna

CPI Ramakrishna: ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారతాయని ఇండియా కూటమి విశ్వాసంగా చెప్పుకొచ్చారు.. అయితే, టీడీపీకి అధికారం వస్తే అది బీజేపీతో పొత్తు వల్ల కాదు.. కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రరెస్‌ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే తెలుగుదేశం పార్టీకి అధికారం రావొచ్చు అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పోలీస్ అధికారుల బదిలీ, సస్పెన్షన్లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.. పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. సిట్ విచారణ సమగ్రంగా జరగాలన్నారు. మరోవైపు.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరం కూల్చి చేస్తారనేది అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు రామకృష్ణ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన.. ఏపీలో కూటమి గెలుపు ఖాయం అన్నారు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. కాగా, ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ జరగగా.. వచ్చే నెల ఫలితాలు వెల్లడికానున్న విషయం విదితమే. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి.. అంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Read Also: Gujarat : వీళ్లు మనుషులు కారు.. కుక్క కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కింద పడేశారు

Exit mobile version