Site icon NTV Telugu

CPI Narayana: బాంబుల నుంచి గులకరాయికి వచ్చారు.. మంచిదే..!

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: బాంబు దాడుల నుంచి గులక రాయికి వచ్చారు.. మంచిదే అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విజయవాడలో రాయి దాడి జరిగిన విషయం విదితమే కాగా.. జగన్ దాడి ఘటనపై సెటైర్లు వేశారు నారాయణ.. బాంబులు వేసుకోవడం నుండి గులకరాయికి వచ్చారు మంచిదే.. గులకరాయి దాడి అంటూ రాజకీయాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళ్లకు కట్టు కట్టుకుని తిరిగింది.. ఇక్కడ సీఎం వైఎస్‌ జగన్ కళ్లకు కట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు గులకరాయి కథలు అంతా తెలుసు.. రాయి వేసిన వారిని కాకుండా పోలీసులు ఉద్దేశ పూర్వకంగా మరోకరిని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.. ఇప్పుడు మరణవార్త అంటే ఎవరు నమ్మబోరన్నారు. ఇక, తెలంగాణాలో తప్పు చేసినా అధికారులు.. ఇప్పుడు జైళ్లకు వెళ్లారు.. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అధికారుల వంతు అవుతుందని సీరియస్‌గా హెచ్చరించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కాగా, సీఎం జగన్‌పై సీరియస్‌గా తీసుకున్న బెజవాడ పోలీసులు.. ఈ కేసులో ఏ-1ను అరెస్ట్ చేసిన విషయం విదితమే.. అతడికి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది.. ఇక, హత్య చేసేందుకు సీఎంపై రాయి దాడి చేశారంటూ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయం విదితమే.

Read Also: Ajit Pawar: ఈ ఎన్నికలు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్య యుద్ధం..

Exit mobile version