NTV Telugu Site icon

Cow vs Snake: ఆవు ముందుకు వచ్చి పడగ విప్పిన పాము.. తరువాత ఏం జరిగిందంటే

Cow

Cow

Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాటిని చూస్తే అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం ఓ ఆవు వింతగా ప్రవర్తించింది. పామును చూసి భయపడకుండా దానిని తన నాలుకతో తాకింది.

Also Read: Retirement Age Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ ఏజ్ ఐదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు

ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమ ద్వారా ఇవి రెండు ఒకదానిపై ఒకటి నమ్మకం పొందాయి. వీటి మధ్య బంధాన్ని వర్ణించడం కష్టం అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు సుశాంత నంద. ఇక ఇందులో ఒక ఆవు, పాము దగ్గర దగ్గరగా ఉంటాయి. రెండు ఒకదాని ముఖంలో ఒకటి ముఖం పెట్టి చూసుకుంటున్నట్లు ఉన్నాయి. దీనిని చూస్తుంటే ఆవును పాము కాటేస్తుందని లేదా ఆవే పామును చంపేస్తుందని అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం అనుకున్నట్లు కాకుండా పాము ఆవు దగ్గరకు వెళ్లి దాని మూతి మీద నాకుతుంది. అంతే తప్ప దానిని ఏమి చేయదు. ఆవు కూడా ఎంతో ప్రేమగా పాము తలపై నాలుకతో నిమురుతుంది. ఈ బంధం చూడటానికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రకృతి ఏ ప్రాణి అయినా తమకు హాని అనుకుంటేనే వేరే ప్రాణికి హాని చేస్తాయని లేదంటే వాటి జోలికి వెళ్లవని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు వాటి మధ్య ఏం జరుగుతుందా అని ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉందని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నాగేశ్వరుడు, నందీశ్వరుల బంధం అంటే ఇదే కాబోలు అంటూ ఇంకొందరు అంటున్నారు.