Omicron BF7 : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోమారు భయపెడుతోంది. వేగంగా విరుచుకుపడేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో చైనాలో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి అత్యంత ఘోరంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వేలాది మంది పేషెంట్లు వెల్లువలా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వారికి వైద్యం అందించలేకపోతున్నారు డాక్టర్లు. నిర్విరామంగా సేవలను అందిస్తుండడంతో వారు అలసిపోతున్నారు. ఆ దేశంలో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఒక పక్క ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వందల మంది చనిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ఇది ఇలా ఉంటే చైనాలోని ఒక డాక్టర్ అప్పటి వరకు పేషెంట్లకు చక్కగా వైద్యం అందించాడు. అంతే హఠాత్తుగా రోగుల ముందే వైద్యం చేస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వైద్యుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని దృశ్యాలు కంటతడి పెట్టించేలా అత్యంత ఘోరంగా ఉన్నాయి.
Omicron BF7 : చైనాలో చేతులెత్తేసిన డాక్టర్లు.. వైద్యం చేయలేక కుప్పకూలిన వైనం
Show comments