Site icon NTV Telugu

AP Coronavirus Cases: గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్‌ కేసులు!

Coronavirus Ap

Coronavirus Ap

కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చిన వారికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్దారణ అయింది.

Also Read: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)

పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తెనాలి, విజయవాడకు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకింది. కొవిడ్‌ వార్డులో ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలని దాటడం కలకలం రేపుతోంది. అత్యధికంగా కేరళలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా దాదాపుగా 60 మంది మరణించారు.

Exit mobile version