Site icon NTV Telugu

Corona : కరోనా తిప్పలు.. బాలికల విషయంలో సంచలన నిజాలు

Corona Cases

Corona Cases

Corona : మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. కోవిద్ మహమ్మారి ప్రభావం తగ్గింది అనుకున్న ప్రతీసారి నేనున్నాను అంటూ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. రూపాలను మార్చుకుంటూ ప్రజలపై విరుచుకుపడుతుంది. అంతే కాకుండా కరోనా వచ్చి పోయిన వారిలోనూ దాని ప్రభావం ఏదో ఒక రకంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Read Also: Karthi: ఎవర్రా మీరంతా.. ఇంతలా ప్రేమిస్తున్నారేంట్రా?

తాజాగా ఓ సర్వేలో కరోనా మహమ్మారి బాలికల విషయంలో సంచలన నిజాలను వెల్లడించింది. వారిలో ముందస్తు రజస్వల కావడానికి కోవిద్ దారి తీస్తోందని దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. కరోనా తర్వత బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. సాధారణంగా బాలికలు 13నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, ఏళ్ల బాలికలు సైతం రజస్వల అవుతున్నాయని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్ ప్రీత్ సేథీ తెలిపారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10వరకు వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయన్నారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి.

Read Also: Kriti Kharbanda: థైస్ అందాలతో కాక రేపుతున్న పవన్ హీరోయిన్

బాలికల్లో ఇలా జరిగేందుకు కారణం.. కోవిద్ వ్యాప్తిని నియంత్రించేందుకు చేపట్టిన లాక్ డౌన్ తో విద్యాసంస్థలు మూత పడ్డాయి. జనమంతా ఇళ్లకే పరిమితం కావడంతో విద్యార్థులకు ఆటపాటలు లేవు. అందువల్ల చిన్న పిల్లలో మెటబాలిజంపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా మెదడు మన శరీరం ఎత్తును పరిగణలోకి తీసుకోదు. బరువును మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. శరీరంలో హర్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం బరువు ఒకస్థాయికి చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తోంది. దీని ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ఈ సమస్యనుంచి బయట పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Exit mobile version