NTV Telugu Site icon

Jani Master-Bail: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్!

Jani Master

Jani Master

Interim Bail for Jani Master: టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషాకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో జానీకి ఊరట లభించింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌ గత నెలలో అరెస్టైన విషయం తెలిసిందే.

నేషనల్‌ అవార్డు తీసుకోవడం త‌న‌కు 5 రోజుల పాటు మ‌ధ్యంత‌ర‌ బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో జానీ పిటిష‌న్ దాఖలు చేశారు. ‘నాకు ఇటీవ‌ల ఉత్తమ‌ నృత్య‌ ద‌ర్శ‌కుడిగా అవార్డు వ‌చ్చింది. ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. ఐదు రోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వండి’ అని జానీ కోర్టును కోరాడు. అతడి దరఖాస్తును పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం.. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకూ బెయిల్‌ మంజూరు చేసింది.

Also Read: Virat-Anushka: ఇది ట్రయిల్ బాల్.. కోహ్లీకే రూల్స్ నేర్పించిన అనుష్క! నవ్వు ఆపుకోవడం కష్టమే

జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్‌ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ముంబై హోటల్‌లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అవుట్ డోర్ షూటింగ్ సమయంలో నాపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక జానీ దగ్గర పని మానేశాను. నాకు సొంతగా ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జానీని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.

Show comments