జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి మంజూరైన బెయిల్ . సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయవద్దని… సాక్ష్యాలను చేరిపివేయవద్దని షరతులు విధించింది న్యాయస్థానం. కరీంనగర్ జైలుకు చేరిన సంజయ్ బెయిల్ పత్రాలు. మధ్యాహ్నం వరకు సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టెన్త్ పేపర్ లీకేజీ లో మంగళవారం సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.
Bandi Sanjay Bail Live: బండి సంజయ్ కి బెయిల్.. కండిషన్స్ అప్లై

Maxresdefault