Site icon NTV Telugu

JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు

Jananayagan (2)

Jananayagan (2)

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9, 2026న సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై  మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు తమ తీర్పును ప్రకటించారు.

Also Read : Devara 2 : దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన నిర్మాత సుధాకర్

ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ (CBFC)ను ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. ‘జననాయకుడు’ సినిమాకు ముందుగా U/A సర్టిఫికెట్ జారీ చేసి, అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, సినిమా కు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు పై బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ, ఈ అంశాన్ని మళ్లీ అదే స్థాయిలో పునర్విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ వివాదం మరోసారిడైలమాలో  పడింది. ఈ అంశంపై తదుపరి నిర్ణయం వచ్చిన తర్వాతే సినిమా విడుదలకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఇక జననాయగన్ దాదాపు వచ్చే అవకాశం లేదు.

Exit mobile version