NTV Telugu Site icon

OYO : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్.. ఆపై బ్లాక్ మెయిల్

New Project 2024 08 29t131532.732

New Project 2024 08 29t131532.732

OYO : ఓయో రూమ్‌ అనగానే మన మైండ్‌లో ఏం థాట్స్‌ వస్తాయో అందరికీ బాగా తెలుసు.. అయితే ఓయో రూములు అంటే అందుకు మాత్రమే అని జనాల్లో బాగా ముద్రపడిపోయింది. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే.. ఇకపై ఓయో రూమ్స్‌కు వెళ్లాలంటే..భయపడతారేమో..! ఓయో హోటల్స్​లో రహస్య కెమెరాలు పెట్టి, అక్కడికి వచ్చే జంత రొమాంటిక్ దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్న హోటల్ యజమాని బండారం బయటపడింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది.

Read Also:NSG New Chief: ఎన్‌ఎస్‌జీ కొత్త డైరెక్టర్ జనరల్గా బి. శ్రీనివాసన్‌..

హైదరాబాద్ శివారు శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్ రూంలలోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల సన్నిహిత దృశ్యాలను రికార్డు చేసి.. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి బ్లాక్ మెయిట్ చేస్తున్నాడు. అందినంత ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఎక్కువగా లాడ్జ్ కు వచ్చే యువతనే టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు.

Read Also:Rahul Gandhi : అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాహుల్ అమెరికా పర్యటనలో మార్పులు

అంతకుముందు కూడా.. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని పలు ఓయో హోటళ్లలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు అమర్చి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే ముఠాగుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓయో హోటల్​కు వెళ్లి దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారు తీసుకున్న రూమ్​లో కెమెరాలు ఉన్నట్టు వారికి తెలియదు. ఆ తర్వాత గదిని వెకేట్​ చేసి వెళ్లిపోయారు. కొన్ని రోజులకు ఈ నేరస్థుల బృందం మళ్లీ ఆ ఓయో రూమ్​కి వెళ్లింది. సీక్రెట్​ కెమెరాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓ కెమెరాలో.. దంపతులు సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వారిని ట్రాక్​ చేసింది ఆ బృందం. డబ్బులు ఇవ్వకపోతే, వీడియోలను వైరల్​ చేస్తామని బెదిరించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఇందులో హోటల్​ సిబ్బంది పాత్ర లేదని తేలింది. విష్ణు సింగ్​, అబ్దుల్​ వాహవ్​, పంకజ్​ కుమార్​, అనురాగ్​ కుమార్​ సింగ్​లు.. మూడు వేరువేరు గ్యాంగ్స్​కు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.