Couple Missing: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన దంపతులు.. మా కోసం వెతకొద్దు అని మెసేజ్..!
- మేం ఎక్కువగా అప్పులు చేశాం.. తీర్చలేక వెళ్ళిపోతున్నాం..
- మా కోసం వెతక వద్దు అంటూ.. దంపతుల అదృశ్యం..
- గోదావరిలో దూకి చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Missing: మేం ఎక్కువగా అప్పులు చేశాం.. తీర్చలేక వెళ్ళిపోతున్నాం.. మా కోసం వెతక వద్దు అంటూ.. దంపతులు అదృశ్యమయ్యారు.. గోదావరి నదిలో దూకి చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్ రాసి మరి భార్యా భర్తలు అదృశ్యమయ్యారు… పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. వాళ్లకు మేం ఊరు వెళ్ళామని చెప్పండి.. లేకపోతే వాళ్లు ఏడుస్తారు అంటూ ఆ లెటర్ లో రాశారు ఆ దంపతులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గా రావు, అతని భార్య సుశీల.. గురువారం సాయంత్రం 4 గంటల నుండి కనిపించడం లేదని బంధువులు అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో ఆ దంపతుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గా రావు తన సెల్ నుండి పండు అనే వ్యక్తి సెల్ కు పంపిన ఆడియో మెసేజ్ లో మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గోడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా దాంట్లోనే పెట్టాను.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని కోరాడు దుర్గారావు.. అయితే, ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా? అదృశ్యం అయ్యారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది..
Read Also: Himachal : హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి, 49 మంది గల్లంతు
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!