NTV Telugu Site icon

Pushpa 2 : కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్..టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా..

Pushpa2

Pushpa2

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 ” క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్  రిలీజ్ చేసారు.

Read Also :F4 : ఎఫ్ 4 కు రంగం సిద్ధం..త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఫన్ టాస్టిక్ మూవీ..?

“పుష్ప పుష్ప”అంటూ సాగే ఫస్ట్ సింగల్ కు నెట్టింట భారీగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఫస్ట్ సింగల్ కి వచ్చిన క్రేజ్ తో మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ను రిలీజ్ చేసారు .అల్లుఅర్జున్ ,రష్మిక మధ్య సాగే “కపుల్ సాంగ్”ను మేకర్స్ రిలీజ్ చేసారు.స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నెట్టింట ఈ సాంగ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.ఈ సాంగ్ ను తెలుగు ,తమిళ్ మలయాళం ,కన్నడ ,హిందీ ,బెంగాలీ భాషల్లో లాంచ్ చేయగా నెట్టింట రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ 1.67 మిలియన్లకు పైగా లైక్స్ తో  నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.