Interfaith Affair: వేరే మతం అమ్మాయిని ప్రేమించడమే అతడు చేసుకున్న పాపంగా మారింది. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మతాంతరం సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యతో పాటు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో ఒక వ్యక్తిని హత్య చేసి అతని మృతదేహాన్ని ముక్కలు చేయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ హత్యకు సంబంధించి దంపతులతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
Also Read: Guinness World Record: 3.13 సెకన్లలో రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి గిన్నిస్ రికార్డు.. వీడియో వైరల్
మృతుడు మనోహర్ అనే వ్యక్తి జూన్ 6న అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. జూన్ 9న సలూనిలోని బండల్ పంచాయతీలోని నల్లా నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులు షబీర్, ముసాఫిర్ హుస్సియాన్, అతని భార్య.. మైనర్‌తో మనోహర్ మతాంతర సంబంధం పెట్టుకున్న కారణంగా హత్యకు గురైనట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు మతాలకు చెందిన మనోహర్, నిందితుల మేనకోడలు ప్రేమించుకున్నారు. దీంతో వారి కుటుంబాల మధ్య ఉద్రిక్తత ఏర్పడి ఘర్షణకు దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. బాలికను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చంబా అభిషేక్ యాదవ్ తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Sharukh Khan : ఆ మహిళా అభిమాని చేసిన పనికి ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్..!!
నేరం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక మితవాద సంస్థలు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇతర సంస్థలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని చంబా జిల్లాలోని చురా బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ డిమాండ్ చేశారు. పలు రైట్‌వింగ్ సంస్థలు కూడా నిరసన చేపట్టాలని యోచిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ చంబా అపూర్వ్ దేవగన్ వివిధ వర్గాల నాయకులతో సంభాషించి శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.