NTV Telugu Site icon

Secunderabad: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.20కోట్లతో ఉడాయించిన దంపతులు

Call Money

Call Money

చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అదృశ్యమైన దంపతులు తమకు తామే పోలీసుల ముందు ప్రత్యక్షమైన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులు బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు అందరికీ నమ్మకంగా గత 20ఏళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడికున్న వారికి చిట్టి డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా గత నెల 14న దంపతులు ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారు పారిపోయారని, తాము నష్టపోయామని భావించి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా మంగళవారం రోజు వారికి వారే వచ్చి పోలీసు స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు.

READ MORE: Usha chilukuri: అమెరికా సెకండ్ లేడీగా ఆంధ్రా అమ్మాయి.. ఏపీలో ఎక్కడంటే..!

విషయం తెలుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ధర్నా చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి జమ చేసుకొని తమ ఆడపిల్లల పెళ్ళీల కోసం, ఉన్నత చదువుల కోసం, ఇళ్ల నిర్మాణం కోసం వివిధ అవసరాలకోసం ఉపయోగించుకుందామని అమరేందర్ వద్ద దాచుకున్నమని వారు తెలిపారు. ఒక్కొక్కరు 10లక్షలు, 20లక్షలు, 50లక్షలు చొప్పున చిట్టీలు వేసి మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహిళలు, వృద్దులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐతే వారాసిగూడ ఇన్ స్పెక్టర్ ఆర్ సైదులు మాట్లాడుతూ చిట్టీ వేసిన వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వారికి వారే నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు చెప్పారు.