Site icon NTV Telugu

Kerala: లవర్‌తో పారిపోయిన కూతురు.. మా శవాలు కూడా చూపించొద్దంటూ తల్లిదండ్రుల ఆత్మహత్య..

Kerala Incident

Kerala Incident

Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Read Also: Varun Dhawan: తండ్రి కాబోతున్న స్టార్ హీరో

బంధువులు, సన్నిహితులు ఫోన్ చేసిన స్పందింకపోవడంతో, స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూడగా బెడ్‌రూంలో అచేతనంగా కనిపించారు. ప్రాణాలు ఉన్నాయేమో అని ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిందు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బిందు ఘటనకు పాల్పడిన తర్వాత తొందరగా ప్రాణాలు కోల్పోగా.. ఉన్ని కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.

బంధువులు చెబుతున్న దాని ప్రకారం.. అంతకుముందు రోజు కాలేజీలో చదువుతున్న దంపుతల కుమార్తె, తన ప్రియుడితో పారిపోయింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ మనస్తాపంలో ఉన్నట్లు తెలిపారు. లవ్ ఎఫైర్ మానుకోవాలని తల్లిదండ్రులు చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో కుంగిపోయినట్లు తెలిపారు. బెడ్రూంలో సూసైడ్ నోట్ లభించింది. తమ కూతురుకు మా శవాలను చూపించొద్దని అందులో వేడుకున్నారు.

Exit mobile version