NTV Telugu Site icon

UP FIRE: యూపీలో ఘోరం.. కారు దగ్ధమై దంపతులు సజీవదహనం

Cae

Cae

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేక దంపతులిద్దరూ కారులోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరగగానే మంటలు వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దంపతులు కారులోనే సజీవ దహనమయ్యారని పోలీసులు శనివారం తెలిపారు.

ఇది కూడా చదవండి: Election Commission: తప్పుడు కథనాలపై స్పందించిన ఈసీ.. ఏం చెప్పిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయ్-సాండి రహదారిలోని బఘ్రాయ్ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆకాష్ పాల్ (23) శుక్రవారం తన భార్య కీర్తి (20)తో కలిసి ఏదో పని నిమిత్తం సందీకి చేరుకున్నాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ నృపేంద్ర తెలిపారు. బఘ్రాయ్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వారి కారు ఢీకొట్టిందని… దీంతో మంటలు చెలరేగినట్లు చెప్పారు. వాహనంలోనే దంపతులు సజీవ దహనమయ్యారని ఏఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: Police Children: చదువులో ప్రతిభ చూపిన పోలీసుల పిల్లలను సన్మానించిన ఎస్పీ..

Show comments