Site icon NTV Telugu

Akhilesh Yadav: 2024 ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొట్టడం ఖాయం..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని, 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం అన్నారు. బీజేపీ ధనవంతుల కోసం పనిచేస్తోందని, ప్రజలకు ద్రవ్యోల్బణం, ద్వేషపూరిత రాజకీయాలు మాత్రమే ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆయన ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Uddhav Thackeray: అంబేద్కర్ మనవడితో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు..

‘పేదరికం, నిరుద్యోగం, ఆకలి, ద్రవ్యోల్బణంతో పాటు సామాన్య ప్రజానీకానికి బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలను ఇచ్చింది. ధనవంతులను మాత్రమే సంపన్నులను చేసింది, బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, రాజకీయంగా చాలా ఏళ్లుగా వెనుకబడిపోయింది’ అని అఖిలేష్ యాదవ్ హిందీలో ట్వీట్ చేశారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో బీజేపీని ప్రజలు ఓడించి, ఢిల్లీ నుంచి తరిమికొడతారని ఆయన అన్నారు.

 

Exit mobile version