రేపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రాబోవు అయిదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం తేలనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. మే13న పోలింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అక్కడ భారీ స్థాయిలో పోలీసులు సిబ్బందిని, కేంద్ర బలగాలను మోహరించారు.
READ MORE: Varla Ramaiah: రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉంది.. ఈసీకి వర్ల రామయ్య లేఖ
కౌంటింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. ” ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.” అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి. మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందా.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తోందా అనే చర్చ జరుగుతోంది. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధింంచి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జూన్ 4న కౌంటింగ్‌లో భాగంగా.. ముందుగా సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఈటీబీపీఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.