పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. రకరకాల రంగుల్లో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.. అందుకే వయస్సు తో సంబంధం లేకుండా అందరూ తింటుంటారు.. అలాంటి పీచు మిఠాయి ఇక మీదట కనిపించదనే వార్త విని చాలా షాక్ అవుతున్నారు.. దీన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తుండటంతో దీన్ని నిషేధించినట్లు తెలుస్తుంది.. అస్సలు విషయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పీచు మిఠాయి అంటారు. కాటన్ క్యాండీ అనేది ఒకరకమైన చక్కెరతో తయారు చేస్తారు. ఇది షుగర్ సిరప్ నుండి తయారవుతుంది. మిషన్‌లో ఒక చిన్న రంధ్రం ద్వారా పోగులు పోగులుగా బయటకు వస్తుంది. వీటిని ఒక కర్రపై సేకరించి వివిధ ఆకృతుల్లో కాటన్ క్యాండీ అందిస్తారు.. అంతేకాదు అనేక రకాల రంగుల్లో కూడా లభిస్తుంది..
వ్యాపారులు లాభాలకు ఆశపడి కాటన్ క్యాండీని అత్యంత విషపూరిత రసాయనాలతో తయారు చేస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక దుకాణాలు ‘రోడమైన్ బి’ అనే విషపూరితమైన రసాయనాలతో ఈ మిఠాయిని తయారు చేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో రోడమైన్-బి అనే విష పదార్థం ఉన్నట్లు గుర్తించారు.. ఇక అధికారులు అలెర్ట్ అయ్యారు.. వెంటనే అన్ని రకాల వాటిని గుర్తించి బ్యాన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..
‘రోడమైన్ బి’ అనే రసాయనిక సమ్మేళనంను ఇందులో కలుపుతారు.. దీనిని ఆహారం ద్వారా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాలేయం కూడా దెబ్బతింటుంది. దీని అధిక వినియోగం విషంతో సమానం. అలాగే అధిక చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. ఇది హైపర్యాక్టివిటీకి దారి తీస్తుంది. ఇది పిల్లలలో మూడ్ స్వింగ్‌లకు దారి తీస్తుంది. అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు..వీటిని విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలని పుదుచ్చేరి అధికారులను ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఈ క్రమంలో కొన్ని షాపులకు సీల్ వేశారు.. ఇంకా ఇలాంటి దుకాణాల పై రైడ్ చెయ్యాలని అధికారులకు సూచించారు..