Site icon NTV Telugu

ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా

Court

Court

ACB court: లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి చిక్కిన అనంతపురం జిల్లా పెనుగొండ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగభూషణం పై కర్నూలు ఏసీబీ కోర్టు కఠిన చర్యలకు పూనుకుంది.. కోర్టు ఆయనకు ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించడంతో పాటు 2 లక్షల రూపాయాలు జరిమానా విధించింది. కోర్టు తీర్పులో రూ.2 లక్షల జరిమానాలో రూ.1,90,000ను బాధితుడు, అతని భార్యకు పరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Read Also: PBKS vs GT: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

కేసు వివరాల్లోకి వెళ్తే.. ఫిర్యాదుదారుడు అజ్మీత్ 2014లో ఇతర కులానికి చెందిన అనసూయమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ కులాంతర వివాహం ప్రోత్సాహకంగా, 2016లో నాగభూషణం ఫిర్యాదుదారుడిని సంప్రదించి, వివాహ ప్రోత్సాహక నిధులను విడుదల చేయడానికి రూ.4,000 లంచం డిమాండ్ చేశారు. తత్ఫలితంగా, 2018 ఏప్రిల్ 27న అనంతపురంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా నాగభూషణాన్ని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ కేసులో కోర్టు సమగ్ర దర్యాప్తు, సాక్ష్యాల ఆధారంగా కఠిన తీర్పు వెలువరించింది.. అయితే, ఇది అవినీతి అధికారులపై గట్టి హెచ్చరికగా కూడా చెప్పుకోవచ్చు.. న్యాయస్థానం తీర్పు ప్రజలకు న్యాయం జరగడమే కాకుండా, భవిష్యత్తులో లంచం కంటే నేర ప్రవర్తనలను నిరోధించే దిశగా కూడా పనిచేయనుంది..

Exit mobile version