నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. అంత మొత్తం డబ్బును లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే.. బంగారు ఆభరణాలు, ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు చేపట్టారు.
Read Also: GOOD BAD UGLY: కీలక షెడ్యూల్ లో గుడ్ బాడ్ అగ్లీ
మొత్తంగా ఏసీబీ సోదాల్లో రూ. 2,93,81,000 నగదు పట్టుబడగా.. నరేందర్ భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షలను ఉన్నట్లు గుర్తించారు. అలాగే 51 తులాల బంగారు ఆభరణాలు, కోటి 98 లక్షలు విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
Read Also: Salaar 2: ‘సలార్ 2’ సంగతేంటి బాసూ? ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!