NTV Telugu Site icon

USA vs BAN: కోరీ అండర్సన్ విధ్వంసం.. బంగ్లాదేశ్‌పై అమెరికా సంచలన విజయం!

Usa Stun Bangladesh

Usa Stun Bangladesh

United States won by 5 wkts against Bangladesh: టీ20 క్రికెట్‌లో అమెరికా (యూఎస్ఏ) సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ ఘనత అందుకుంది. హౌస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై యూఎస్ఏ 5 వికెట్ల తేడాతో గెలిచింది. యూఎస్ఏ విజయంలో కోరీ అండర్సన్ (34), హర్మీత్ సింగ్ (33) కీలక పాత్ర పోషించారు. నాలుగు ఓవర్లలో తక్కువ రన్స్ ఇవ్వడంతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్మీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తౌహిద్ హృదయ్ (58; 47 బంతుల్లో 4×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. లిటన్ దాస్ (14; 15 బంతుల్లో 1×4, 1×6), సౌమ్య సర్కార్‌ (20; 13 బంతుల్లో 3×4), షాంటో (3), షకిబ్ అల్ హసన్ (6) నిరాశపర్చగా.. మహ్మదుల్లా (31; 22 బంతుల్లో 2×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ రెండు వికెట్లు తీశాడు.

Also Read: MS Dhoni: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి: ధోనీ

ఛేదనలో యూఎస్‌ఏ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో యూఎస్‌ఏ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మోనన్క్ పటేల్ (12), ఆండ్రైస్ గౌస్ (23), స్టీవెన్ టేలర్ (28), ఆరోన్ జేమ్స్ (4) వరుస విరామాల్లో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో ఆండర్సన్, హర్మీత్ సింగ్ బంగ్లాను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆడిన ఈ ఇద్దరు యూఎస్‌ఏను విజయతీరాలకు చేర్చారు. ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్స్ తీశాడు. మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభం కానున్న వేళ ఈ విజయం యూఎస్‌ఏ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో యూఎస్‌ఏ ప్రపంచకప్‌ ఆడనుంది.

Show comments