NTV Telugu Site icon

Lionel Messi Crying: వెక్కివెక్కి ఏడ్చిన లియోనెల్‌ మెస్సీ.. వీడియో వైరల్!

Lionel Messi Injury

Lionel Messi Injury

Argentina beats Colombia in Copa America 2024 Final: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ వెక్కివెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్లో భాగంగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ కన్నీరుమున్నీరయ్యారు. కెరీర్‌లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడిన అతడు డగౌట్‌లో కూర్చొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్లో లియోనెల్‌ మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్‌ 36వ నిమిషంలో అతడి చీలమండకు గాయమైంది. నొప్పితో అతడు మైదానంలో కింద పడిపోయాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేదు. అయినప్పటకి మెస్సీ మైదానాన్ని వీడలేదు. మ్యాచ్ హాఫ్ టైమ్ తర్వాత కూడా అర్జెంటీనా ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో.. తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన ఆటను కొనసాగించాడు. నొప్పి తీవ్రం కావడంతో 66వ నిమిషంలో మైదానం నుండి బయటకు వెళ్లిపోయాడు. డగౌట్‌లో కూర్చోన్న మెస్సీ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కావడంతో కన్నీరు పెట్టుకున్నాడు.

Also Read: MS Dhoni Instagram: నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్న ఎంఎస్ ధోనీ.. అందులో ‘సూపర్ స్టార్’ ఒకరు!

మియామీలో జరిగిన కోపా అమెరికా 2024 ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్‌ సాధించలేకపోయాయి. దాంతో 25 నిమిషాలు ఎక్స్‌ట్రా సమయం కేటాయించారు. అదనపు సమయంలో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్‌ సాధించడంలో విఫలమయ్యాయి. మరో 8 నిమిషాల్లో (112 నిమిషంలో) మ్యాచ్ ముగుస్తుందనగా.. లౌటారో మార్టినెజ్ గోల్ కొట్టి అర్జెంటీనాను కాపాడాడు.

Show comments