NTV Telugu Site icon

Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..

New Project (34)

New Project (34)

Roti: సాధారణంగా చాలా ఇళ్లలో, ప్రజలు గ్యాస్‌పై నేరుగా పుల్క లేదా రొట్టెలను కాల్చుతారు. కానీ అలా చేయడం చాల హానికరం. ఇలా కాల్చిన చపాతీలు లేదా పుల్కాలు తింటే శరీరంలోని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉత్తర భారతంలో చపాతీ తినకుండా ప్రజల భోజనం పూర్తికాదు.. వారి కడుపు నిండదు. రోటీ ప్రజల ఆహారంలో ముఖ్య భాగం. కొన్ని ప్రాంతాలలో రోటీని చపాతీ అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీష్ బ్రెడ్ అంటారు. రోటీ తయారీ అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఈ పిండిని నూనె, నీళ్లు పోసి మెత్తగా చేసి కొంతసేపు ఉంచాలి. తరువాత దానిని తవాపై కాల్చి ఫుల్కాగా తయారు చేస్తారు. చపాతీలను నేరుగా స్టవ్ మీద కాల్చినట్లయితే అది ఆరోగ్యానికి హానికరమని ఓ అధ్యయనంలో తేలింది.

Read Also: Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక పరిశోధన ప్రచురించబడింది. పరిశోధన ప్రకారం, సహజ వాయువు గ్రిల్స్, గ్యాస్ స్టవ్‌లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ కణాలను విడుదల చేస్తాయి. ఈ కణాలన్నీ శరీరానికి ప్రమాదకరం. ఈ కాలుష్య కారకాలు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు కారణమవుతాయి. మరో అధ్యయనం కూడా జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్‌లో ప్రచురించబడింది. అధిక వేడితో ఆహారాన్ని వండినప్పుడు క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయని పేర్కొంది.

Read Also: Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు

ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చీఫ్ సైంటిస్ట్ డా. పాల్ బ్రెంట్ ద్వారా 2011లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదిక ప్రకారం, గోధుమ పిండిలో సహజసిద్ధమైన చక్కెరలు, ప్రొటీన్లు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పిండిని రోల్ చేసి గ్యాస్ మీద కాల్చిన తర్వాత క్యాన్సర్ కారకాలు రసాయనాలు ఏర్పడతాయని తెలిపింది.