Site icon NTV Telugu

Oil Rates: అమాంతం కొండెక్కిన వంటనూనె ధరలు..

Oil Rates

Oil Rates

Oil Rates Hike: కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతుందని ప్రకటించిన వెంటనే వాడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అది కూడా ఏకంగా లీటర్ కు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. శనివారం నాడు 115 రూపాయలు ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ అదే రోజు సాయంత్రానికి 130 రూపాయలకు చేరుకుంది. ఇక బయటి మార్కెట్లో 100 రూపాయలు ఉన్న పామాయిల్ ప్రస్తుతం 115 రూపాయలు అయింది. కేంద్ర ప్రభుత్వం సోయా, సన్ ఫ్లవర్, పాం ఆయిల్ పై సుంకం విధిస్తున్నట్లు తెలపగా.. దుకాణదారులు వెంటనే భారీగా పెంచేశారు. కేవలం వంటలు మాత్రమే కాదు. దీపారాధనకు ఉపయోగించే నూనె కూడా ధరను పెంచేశారు దుకాణదారులు. ఇలా కేవలం దుకాణాల్లో మాత్రమే కాకుండా ఆన్లైన్ లో కూడా విక్రయిదారులు అమాంతం చేశారు. మరి కొందరైతే ఏకంగా నో స్టాక్ బోర్డులు పెట్టేశారు.

Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.

ఒక్కసారిగా 15 నుంచి 20 రూపాయల తర్వాత పెంపుతో వినియోగదారుల్లో ఆగ్రహం నెలకొంది. దుకాణదారులు నిల్వ ఉన్న సరుకులు కూడా అధిక ధరలకు విక్రయించటం ఏంటంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఈ నిబంధనలో వంటనూనెల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన కూడా లేకపోలేదు. ప్రస్తుతం హోల్సేల్ లో పామ్ ఆయిల్ 110 రూపాయలు అమ్ముతుండగా చిల్లర దుకాణాలలో 120 నుంచి 140 రూపాయల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఆన్లైన్లో అయితే శనివారం ఉదయం వరకు ఎంఆర్పి కంటే తక్కువగా కనిపించిన ఆయిల్ ధరలు.. సుంకం ప్రకటన రావడంతో ఆన్లైన్ లో ధరలు ఎంఆర్పి రేటు వచ్చేసాయి. ఎమ్మార్పీ ధర ఎంత ఉంటే అంతలా ధరని నిర్ణయించారు అమ్మకదారులు.

Exit mobile version