NTV Telugu Site icon

Viral Video : ఏం క్రియేటివి బాసూ .. ఇలాంటి కాఫీని జీవితంలో తాగి ఉండరు..

Coocker Coffee

Coocker Coffee

ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఫుడ్ వ్యాపారులు మాత్రం జనాలను ఆకట్టుకోవడం కోసం విచిత్ర ప్రయోగాలను చేస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన కాఫీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి..

ఓ వీధి వ్యాపారి , కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి.. అందరిలా కాకుండా సరికొత్తగా తయారు చేయాలని అనుకున్నాడు. కాఫీ, టీకి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుని సైకిల్‌పై బయలుదేరాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. అతడు కాఫీ చేసే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ కప్పులు తీసుకుని అందులో పాలు, డికాషన్, చక్కెర కలిపాడు. మరోవైపు సైకిల్‌పై ప్రెజర్ కుక్కర్‪కు ఉంచి, దానికి ఓ ప్రత్యేక నాబ్ ఏర్పాటు చేశాడు. చివరగా కలిపి ఉంచుకున్న పాలు, డికాషన్, చక్కెర మిశ్రమంలో కుక్కర్ నాబ్ ద్వారా ఆవిరితో కూడిని నీటిని నింపేస్తాడు.. అప్పుడు అది కాఫీలాగా మరుగుతుంది..

ఆ ప్రెజర్ కుక్కర్ వల్ల చివరకు బాగా వేడి వేడి కాఫీ రెడీ అయిపోతుంది. ఈ కాఫీ ఎంతో రుచిగా ఉండడంతో తాగిన వారంతా మళ్లీ అతడి వద్దకే వస్తున్నారు.. ఆ కాఫీకి డిమాండ్ కూడా ఎక్కువే.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్ చూస్తుంటేనే తాగాలి అనిపిస్తోంది.. మరికొందరు మాత్రం కుక్కర్ కాఫీ సూపర్ బ్రదర్. అంటూ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..