Conversion Racket Busted: అక్రమ మతమార్పిడి ముఠా అనేక రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఢిల్లీకి చెందిన సూత్రధారి అబ్దుల్ రెహమాన్ ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించాడు. ఈ యువతులలో కొందరు ప్రస్తుతం ఈ ముఠా కోసం పనిచేస్తున్నారు. మతమార్పిడి చేసిన కొంతమంది యువతులను, వారి కుటుంబాలను పోలీసులు సంప్రదించారు. రాష్ట్ర పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. బుధవారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను జైలుకు పంపారు.
READ MORE: AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు?
సదర్ ప్రాంతానికి చెందిన సోదరీమణుల కిడ్నాప్ కేసులో కోల్‌కతా, ఇతర రాష్ట్రాల నుంచి 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో గోవాకు చెందిన ఎస్.బి. కృష్ణ అలియాస్ ఆయేషాను విచారించగా.. ఢిల్లీలోని ఓల్డ్ ముస్తఫాబాద్ నివాసి అబ్దుల్ రెహమాన్ అలియాస్ మహేంద్ర పాల్ పేరు తెరపైకి వచ్చింది. మహేంద్ర పాల్‌గా పేరు మార్చుకుని మత మార్పిడులు చేస్తున్నట్లు తేలింది. తరువాత అతని కుమారులు అబ్దుల్లా, అబ్దుల్ రహీమ్, శిష్యుడు జునైద్ ఖురేషి పట్టుబడ్డారు. నిందితులను విచారించగా, అబ్దుల్ రెహమాన్ డజన్ల కొద్దీ బాలికలను మతం మార్చినట్లు వెల్లడైందని పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ తెలిపారు. ఈ బాలికలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ, బరేలీ, అలీగఢ్, రాయ్‌బరేలి, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.
పోలీసుల విచారణలో అబ్దుల్ రెహ్మాన్ యువతులను బ్రెయిన్ వాష్ చేసేవాడని తేలింది. ముఠా సభ్యులు వివిధ మార్గాల ద్వారా యువతులను సంప్రదించేవారు. వారిని ఢిల్లీకి పిలిపించి.. హాస్టల్‌లో ఉంచారు. వీరందరినీ అబ్దుల్ రెహ్మాన్ తన ఇంటికి పిలిపించి ఇస్లాం బోధించేవాడు. వారితో బలవంతంగా కల్మా పారాయణం చేసేవాడు. వారిని బయటకు వెళ్లనివ్వ కుండా చేసేవాడు. ముఖ్యంగా హిందూ మతానికి చెందిన యువతులనే టార్గెట్ చేశాడు.
ఇలాగే.. ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు అమ్మాయిలను ఢిల్లీకి పిలిచారు. వారిని సైతం మతం మార్చారు. ఈ యువతులు గ్రూపులో చేరారు. ప్రస్తుతం ఒక ముఠాలా పనిచేస్తున్నారు. వారు కాలేజీలలో చదువుతున్న అమ్మాయిలతో నెమ్మదిగా మాటలు కలుపుతారు. వారికి ఇస్లాం గురించి చెబుతారు. ఇస్లాంలోకి చేరేలా సిద్ధం చేస్తారు. ఇలా సిద్ధమైన వాళ్లను ముఠాలోని ఇతర సభ్యులు సంప్రదిస్తారు. దీని తరువాత, వారు ఈ అమ్మాయిలను వారి ఇంటికి పిలుస్తారు. ఇలా ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా ఒకసారి ఢిల్లీకి పిలుస్తారు. ఢిల్లీలో వారికి నికాహ్(నికాహ్ అనేది ఇస్లామిక్ వివాహాన్ని సూచిస్తుంది. ఇది ఒక మతపరమైన కార్యక్రమం) పూర్తి చేస్తారు. అనంతరం హిందూ బాలికలను కల్మా పఠించమని బలవంతం చేశారు.
అబ్దుల్ రెహమాన్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మౌలానా కలీం సిద్ధిఖీ వద్ద పనిచేస్తున్నాడు. అతను జైలుకు వెళ్ళిన తర్వాత, మొత్తం ముఠాకు ఇతను నాయకత్వం వహించాడు. అమాయక అమ్మాయిలే వారి లక్ష్యం. ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు కూడా ఇందులో చిక్కుకున్నారు. ఒక అమ్మాయి ముఠాలో చేరిన తర్వాత.. తిరిగి వెళ్లడం అంత సులభం కాదు. అబ్దుల్ రెహమాన్ మొబైల్‌లో చాలా మంది అమ్మాయిల నంబర్లు, సమాచారం ఉంది. పోలీసు బృందం వారి గురించి దర్యాప్తు చేస్తోంది. మతమార్పిడి కోసం వివిధ ప్రాంతాల నుంచి నిధులు సేకరించినట్లు కూడా తేలింది. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
Conversion Racket Busted: Mastermind Abdul Rehman Trapped Dozens of Girls Across 7 States
