NTV Telugu Site icon

Ashes series: స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..

Asesh Series

Asesh Series

యాషెస్ సిరీస్‌లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టులో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా దొరుకుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 54.4 ఓవర్లలో 283 పరుగులకి ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేయగా బెన్ డక్లెట్ 41, క్రిస్ వోక్స్ 36, మొయిన్ ఆలీ 34, మార్క్ వుడ్ 28 పరుగులు చేయగా.. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా జోష్ హజల్‌వుడ్, టాడ్ ముర్ఫీలు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 103.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 295 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ 24 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 47 రన్స్ చేశాడు.

Read Also: RTI Query: ఆర్టీఐ దరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ఎస్‌యూవీలోనే ఇంటికి..

అయితే, ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆసీస్ టీమ్ ఆధిక్యంలో ఉండగా.. ఈ టెస్టును డ్రా చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మార్నస్ లబుషేన్ తన జిడ్డు బ్యాటింగ్‌‌ తో ఇంగ్లీష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 82 బంతులు ఆడిన లబుషేన్ కేవలం 9 రన్స్ మాత్రమే చేసి.. తన బ్యాటింగ్ స్ట్రైయిక్ రేటు 10.98 మాత్రమే ఉంది. ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ 16, అలెక్స్ క్యారీ 10, మిచెల్ స్టార్క్ 7 రన్స్ చేశారు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ 36, టాడ్ ముర్ఫీ 34 పరుగులు చేయగా జోష్ హజల్‌వుడ్ 6రన్స్ చేశాడు.

Read Also: Dil raju: అందుకే గిల్డ్ పెట్టాము.. ఇష్టం లేదు కానీ బరిలోకి దిగా!

అయితే ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో సెకండ్ రన్ కోసం ట్రై చేయగా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హమ్ వేసిన త్రోని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను గిరాటేశాడు. అయితే, టీవీ రిప్లైలో స్టీవ్ స్మిత్ బ్యాటు గీత దాటడానికి ముందే వికెట్లను కీపర్ కొట్టినట్లు కనిపించింది. తాను అవుటైనట్టు ఫిక్స్ ఐన స్టీవ్ స్మిత్ నిరాశగా పెవిలియన్ వైపు కదిలాడు.. ఇక వికెట్ పడటంతో ఇంగ్లండ్ టీమ్ సెలబ్రేట్ కూడా చేసుకుంది. అయితే టీవీ రిప్లైను చాలా సార్లు చూసిన భారత అంపైర్ నితిన్ మీనన్, స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా… బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు క్రీజు లోపలికి వచ్చిందని నిర్ధారణకు రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు.

Read Also: Prudhvi Raj: అంబటి ఆస్కార్ స్థాయి నటుడా.. అంత సీన్ లేదు!

దీంతో అంపైర్ ఇచ్చిన ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ టీమ్‌ షాక్ కు గురైంది. ఇక దీనిపై స్టువర్ట్ బ్రాడ్ రియాక్ట్ అయ్యాడు. నాకు నిజంగా ఈ రూల్స్ తెలీదు.. స్టీవ్ స్మిత్ చాలా వెనుక ఉన్నాట్లు కనిపించింది.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద స్మిత్‌కి లైఫ్ దక్కిందని అనుకున్నా.. అయితే కుమార్ ధర్మసేనని అడిగితే…లైన్ దాటేలోపు వికెట్ బెయిల్స్ కదలలేదని అతడు చెప్పాడు.. అంపైర్లు ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే నాకు తెలిసిందంటూ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ చేశాడు..