Karnataka Cabinet Expansion: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 19న కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనప్పటికీ, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల కారణంగా ఆ విషయం కుదరలేదు. ఆ తర్వాత బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులోకి వచ్చింది.
రాష్ట్ర కొత్త సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో ప్రస్తుతం 8 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతం కనీసం 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్.. ఇద్దరూ తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య క్యాబినెట్‌లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో.. ప్రభుత్వాన్ని నడపడంలో తమ ఆధిపత్యం చెలాయించే వీలుంటుందనేది వారి భావన.
Read Also: Adipurush: జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…
బుధవారం నుంచి ఢిల్లీలో మకాం వేసిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఖర్గేతో భేటీకి ముందు సీఎం సిద్ధరామయ్య ఆయన నివాసానికి చేరుకుని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు.
కొత్త మంత్రులకు లభించని ఫోర్టు పోలియో
మే 20న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల శాఖల విభజన జరగలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు. కల్బుర్గి జిల్లా చితాపూర్ స్థానం నుంచి గెలిచిన ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Read Also: Sweet Mangoes: వైరల్ అవుతున్న మ్యాంగో మ్యాన్.. నవీన్ ఉల్ హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ రివెంజ్..!
అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖాదర్
కేబినెట్ మంత్రుల కుమ్ములాటల మధ్య బుధవారం కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాదర్ కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఖాదర్‌ను స్పీకర్‌గా చేసిన తర్వాత, సీఎం సిద్ధరామయ్య ఆయనను ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడిగా అభివర్ణించారు. ఏ పార్టీ పట్ల పక్షపాతం లేకుండా పనిచేయడానికి తన లౌకిక మనస్తత్వం దోహదపడుతుందని చెప్పారు.