Site icon NTV Telugu

Contract Assistant Professor : 10 ఏళ్ళు గడిచాయి.. మమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారు

Proffessors

Proffessors

కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తా అన్నారు సీఎం కేసీఆర్.. 10 ఏళ్ళు గడిచాయి.. మమ్మల్ని ఎపుడు రెగ్యులర్ చేస్తారు..సీఎం సార్ అంటూ నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు . ఇవాళ ఉన్నత విద్యామండలిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో పనిచేసే 1445 మంది.. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని అడ్డుకొని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వం తమను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ అభ్యంతరాలను సాకుగా చెబుతున్నారని, కానీ అలాంటి నిబంధనలు ఏమి లేవని వారు వాపోయారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ నేర్పించిన ఉద్యమ స్పూర్తితో.. ఉద్యమాలు చేస్తామన్నారు.

Also Read : Viral Video: పాకిస్తాన్ చంద్రయాన్.. చూసి నవ్వుకుంటున్న జనాలు..!

ఇదిలా ఉంటే.. జులై 4వ తేదీన తమను పర్మినెంట్ ​చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రెగ్యులరైజ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎ.పరశురాం మాట్లాడుతూ.. 60 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నామని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రెగ్యులరైజేషన్​పై ప్రకటన చేసి వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : Monsoon Disease: వర్షాకాలంలో ఈ అలవాట్లను పాటిస్తే.. వ్యాధులు దరిచేరవు..!

Exit mobile version