Adilabad High Court: బాంకే బిహారీ మందిర్ కారిడార్‌ నిర్మాణం.. ఆమోదించిన హైకోర్టు

Untitled 9

Untitled 9

Adilabad High Court: మధురలో బాంకే బిహారీ మందిర్ చాల ప్రసిద్దమైన ఆలయం. నిత్యం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణం చాల చిన్నదిగా ఉండడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉండేది. అలానే దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రాంగణాన్ని విస్తరించేందుకు 5 ఎకరాల భూమిని సేకరించింది. అలానే ప్రాంగణాన్ని విస్తరించేందుకు ప్రణాలికను రూపొందించింది. ఆ ప్రణాళికలను అలహాబాద్ హైకోర్టు ముందు ఉంచింది. కాగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు విచారణ నిన్న ఓ కొలిక్కి వచ్చింది. సోమవారం ఈ కేసును విచారించిన చీఫ్‌ జస్టిస్‌ ప్రితింకర్‌ దివాకర్‌, జస్టిస్‌ అశుతోష్‌ శ్రీవాస్తవల కలిసి ఓ ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తీర్పు ఇచ్చారు.

Read also:Uttarkashi Tunnel: ఎట్టకేలకు టన్నెల్లో 41మంది కనిపించారు.. కానీ వీడియో చూస్తే దారుణం

×
×
Ad

అలానే ఆక్రమణలకు గురైన ఆలయం చుట్టుపక్కల ఉన్న భూమి సమస్యపై స్పందించిన అలహాబాద్ హైకోర్డు ఆలయానికి వెళ్లే రహదారుల ఆక్రమణలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్వేచ్ఛ ఉందని. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఆలయానికి వెళ్లే మార్గాల్లో ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని హై కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది. అలానే పథకాన్ని అమలు చేయడానికి, ఆ ప్రాంతం లోని సాంకేతిక నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా ఈ ప్రణాళిక ప్రకారం పార్కింగ్ ఏరియా వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అలానే దాని ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది.