సీఐఎస్ఎఫ్ లో రెండేళ్ల క్రితం విధుల నుండి తొలగించబడిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కావుకూరులోని అడవి ప్రాంతానికి యూనిఫామ్ వేసుకుని వచ్చి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.. రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ను విధుల నుండి తీసివేయడంతో మనస్థాపానికి గురై ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది… సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీందర్ మరణానికి గల మరిన్ని కారణాలను అన్ని కోణాలలో విశ్లేషిస్తున్నారు.. అతను చనిపోయిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :Supreme Court: సినిమాలకు వెళ్లేవారికి షాక్.. థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు
గీసుగొండ సీఐ, ఎస్సైలు సస్పెండ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్సెస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎ. హరిప్రియ, సుబేదారి ఎస్.ఐ పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.ఆర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్.ఐ హరిప్రియ ఇరువురు గత కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరించడంతో మహిళ ఎస్.ఐ భర్త ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు, మహిళ ఎస్.ఐ హరిప్రియ ఇరువురిని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వురులు జారీచేసారు.
మరో సంఘటనలో సుబేదారిలో నివాసం ఉంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపులు గురికావడంతో రక్షణ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పి.పున్నంచందర్ ఆశ్రయించగా సదరు ఎస్.ఐ. నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీపడాల్సిందిగా బాధితురాలికి ఎస్.ఐ సూచినట్లుగా
వచ్చిన పిర్యాదుపై ఎస్.ఐ సుబేదారిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు.
