యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కోలా నరేష్ (PC -184) అక్కడిక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించారు. మృతుడి స్వస్థలం తాడ్వాయి గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లాగా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Constable: గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి..

Dead