పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాదు, పౌరులు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకుంటుంటారు. విజయవాడలో ఒక కానిస్టేబుల్ చేసిన సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈమధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో యువతీ, యవకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది. ఆత్మహత్యయత్నంకు యత్నించిన యువతిని రక్షించిన కానిస్టేబుల్ ను అభినందించారు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి..ఈనెల 17న యానం గోదావరి ఎదురులంక బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేసింది యువతి.
Read Also: WPL2023 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?
యువతి నదిలోకి దూకేసింది. అయితే, అటుగా వెళ్తున్న ఎఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబు గమనించి వెంటనే రంగంలోకి దూకాడు. వెంటనే గోదావరిలోకి దూకి సదరు యువతిని రక్షించి తల్లితండ్రులకు అప్పగించారు ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబు. కానిస్టేబుల్ ధైర్య,సాహాసాన్ని ప్రసంసిస్తూ ఈరోజు డిజిపి కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబుకు నగదు బహుమతి అందజేశారు డీజీపీ. ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకానికి వీరబాబు పేరు సిఫార్సు చేయాలంటూ సంబంధిత అధికారులకు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆ యువతిని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Ragi Java: నేటినుంచి పాఠశాల విద్యార్ధులకు రాగిజావ పంపిణీ