Himachal Pradesh Elections: గురువారం ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధనిరామ్ షాండిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి, అల్లుడు రాజేష్ కశ్యప్‌ను ఓడించారు. ధని రామ్ షాండిల్, పదవీ విరమణ చేసిన ఆర్మీ కల్నల్, పోటీలో 82 సంవత్సరాల వయస్సులో ఉన్న అతిపెద్ద అభ్యర్థి. కౌంటింగ్ ప్రారంభం నుంచి కశ్యప్‌పై ఆధిక్యాన్ని కొనసాగించారు. చివరిగా 3,858 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
సోలన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకరితో సహా నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కల్నల్ షాండిల్ (రిటైర్డ్) తన సీటుపై పట్టు సాధించలేకపోయారు. సోలన్ నుంచి మొదటిసారి పోటీ చేసిన కశ్యప్‌పై 671 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచాడు. కల్నల్ షాండిల్ గతంలో సిమ్లా ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు.
Himachal Pradesh: ఓట్ల శాతంలో తేడా 0.90 మాత్రమే.. ఆ 20 వేల ఓట్లే బీజేపీ రాతమార్చాయి..
అన్ని పార్టీలు సోలన్‌ను ప్రతిష్టాత్మకమైన సీటుగా పరిగణిస్తూ నవంబర్ 12 ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా నియోజకవర్గంలో తమ పార్టీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించగా.. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. రాజేష్ కశ్యప్ మురుగునీరు, పార్కింగ్ సమస్యను ఎన్నికల సమస్యలుగా లేవనెత్తగా.. కల్నల్ షాండిల్ (రిటైర్డ్) గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. సోలన్ జిల్లా హిమాచల్‌లోని బడ్డీ-బరోతివాలా-నలగర్ పారిశ్రామిక కారిడార్‌కు నిలయం. పట్టణ, గ్రామీణ జనాభా కలయికతో కూడిన అసెంబ్లీ నియోజకవర్గం పుట్టగొడుగులకు ప్రసిద్ధి చెందింది.
