తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని, రూ. 4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి, జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాంగ్ల తో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకు అందరూ… పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
నేటి నుంచి ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’
