Site icon NTV Telugu

Rahul Gandhi : రాహుల్ భారత్‌ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా

Rahul

Rahul

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటితో వంద రోజలు పూర్తి చేసుకోనుంది. ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ 3,500 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. అయితే ఈ యాత్ర 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. గడిచిన మూడునెలలుగా కొనసాగిన యాత్రలో రాహుల్ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడులో సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాల మీదుగా సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగింది. డిసెంబర్ 24న ఢిల్లీలోకి ప్రవేశించనుంది. అనంతరం ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు 2800కి.మీలు పూర్తి చేసుకుంది.

Read Also: Puri Jagannadh : ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేదం.. జనవరి నుంచే అమలు

భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది. ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్‌ శాసనసభ ఎన్నికలు పార్టీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అయితే, యాత్ర ఫలితం వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో చూస్తే యాత్ర.. పార్టీకి పూర్వవైభవాన్ని తెస్తుందని ఒకప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ ఝా విశ్లేషించారు.

Read Also: Worlds Shortest Man: ప్రపంచంలోనే పొట్టి మనిషి.. అతడి హైట్ ఎంతో తెలుసా

తన ఇమేజ్‌పై అధికార పక్ష నాయకులు కురిపిస్తున్న తప్పుడు ప్రచారాలను పటాపంచలు చేస్తూ కొత్త రాజకీయ బ్రాండ్‌గా రాహుల్‌గాంధీ ఎదుగుతున్నారు’ అని ఆయన అన్నారు. కాగా, యాత్రలో రాహుల్‌కి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. ఆహార్యం, విమర్శలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్భాణాలు సంధించుకున్నాయి. నెరిసిన గడ్డంతో ఇరాన్‌ నియంత సద్దాం హుస్సేన్‌లా ఉన్నాడంటూ రాహుల్‌పై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం, వివాదాస్పద క్రైస్తవ బోధకుడితో రాహుల్‌ భేటీ, పాదయాత్రకు కోట్లాది మంది ప్రజానీకం మద్దతు వంటి భిన్న అంశాలతో పాదయాత్ర ముందుకుసాగుతోంది.

Exit mobile version