Site icon NTV Telugu

Rahul Gandhi: స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు కానీ.. రైతుల్ని పట్టించుకోరా?

Rahul

Rahul

డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో (Delhi) నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంపై స్పందించారు.

రైతులు (Farmers Protest) కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్‌కు (MS Swaminathan) భారతరత్న ప్రకటించారు కానీ ఆయన చెప్పిన దానిని అమలు చేయడానికి మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. రైతుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని పేర్కొన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం (BJP) మాత్రం దానిని అమలు చేయడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు స్వామినాథన్ చెప్పినట్లుగా అమలు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.

రైతుల డిమాండ్లు ఇవే

1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి

2. రైతులకు రుణమాఫీ చేయాలి

3. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి

4. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒఫ్పందాలు రద్దు చేయాలి

5. ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వాలి

6. 2020లో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

 

వీటిలో కనీసం మద్దతు ధర, విద్యుత్ సవరణ చట్టం ఒప్పందాలు రద్దు చేయాలి, రుణ మాఫీ, స్వామి నాథన్ సిఫారసులపై హామీ ఇచ్చినా సరేనని రైతులు స్పష్టం చేశారు. ఆ నాలుగు డిమాండ్లపై కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు.

 

Exit mobile version